అర్జున్ రెడ్డిగా విక్రమ్ కొడుకు

252
druva
- Advertisement -

తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్స్  గా వెలుగొందుతోన్న సీనియర్ హీరోల్లో విక్రమ్ ఒకరు. వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకోవడంలో ఎప్పుడూ ముందుండే విక్రమ్, కొంతకాలంగా తన తనయుడు ‘ధృవ్’ ను హీరోగా పరిచయం చేయాలనే ఆలోచనలో వున్నారు. కొత్తదనంతో కూడిన కథ కోసం .. పూర్తి స్థాయిలో నటనకి అవకాశం వుండే పాత్ర కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. అలాంటి విక్రమ్ .. ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ పై దృష్టి పెట్టారు. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఈ సినిమా, ఆయనకి ఒక రేంజ్ లో క్రేజ్ ను తెచ్చిపెట్టింది. యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటూ భారీ వసూళ్లను రాబట్టింది.

vikram-son-dhruv-main

అర్జున్ రెడ్డి సినిమా అతడికి లాంచింగ్ కు సరైన సినిమా అవుతుందనే ఆలోచనలో విక్రమ్ ఉన్నాడనేది కోలీవుడ్ లేటెస్ట్ టాక్. ఈ సినిమా అయితే యాక్టింగ్ పరంగా పేరు తెచ్చుకోవడంతోపాటు యూత్ లోనూ మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుందనేది విక్రమ్ సన్నిహితులు చెబుతున్న మాట. తమిళ్ వెర్షన్ ను విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో సూపర్ హిట్ కావడంతో రీమేక్ రైట్స్ కు ఫ్యాన్సీ ఆఫర్లే వచ్చాయి. తమిళ రైట్స్ కు సంబంధించి లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ దక్కించుకుందని తెలుస్తోంది.  పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

- Advertisement -