రివ్యూ:చిత్రలహరి

1168
chitralahari review
- Advertisement -

మెగా ట్యాగ్‌తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్‌ ప్రారంభంలో సూపర్ హిట్ సినిమాలు చేసి సుప్రీం హీరోగా పేరు తెచ్చుకున్న తేజ్‌ కొంతకాలంగా వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నారు. తాజాగా ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో అందమైన ప్రేమకథ చిత్రలహరితో ముందుకువచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైన ఈ మూవీతో తేజు ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?ఐదు ఫ్లాప్‌ సినిమాల తర్వాత చిత్రలహరితో వచ్చిన తేజు హిట్‌ కొట్టాడా లేదా చూద్దాం..

కథ:

జీవితంలో సక్సెస్ సాధించాలనే కసితో ప్రయత్నాలు చేస్తుంటాడు విజయ్(సాయిధరమ్ తేజ్).అయితే చేసిన ప్రతీ ప్రయత్నం విఫలమవుతుంది. దీంతో నిరాశలో ఉంటాడు. కానీ విజయ్ సక్సెస్ కోసం చేసే ప్రయత్నాలు నచ్చి ప్రేమలో పడుతుంది లహరి(కల్యాణీ ప్రియదర్శి). విజయ్‌ కూడా లహరిని ప్రేమిస్తాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరు విడిపోతారు. సీన్ కట్ చేస్తే చిత్ర(నివేదా పేతురాజ్‌)తో విజయ్‌కి పరిచయం ఏర్పడుతుంది. కెరీర్‌లో సక్సెస్ కోసం చూస్తున్న విజయ్‌కి చిత్ర ఎంట్రీతో ఎలాంటి పరిస్ధితి ఏర్పడింది..?కెరీర్‌లో సక్సెస్ సాధించాడా..?లహరి ప్రేమను సొంతం చేసుకున్నాడా అన్నదే చిత్రలహరి కథ.

sai dharamtej

ప్లస్ పాయింట్స్‌ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్‌ సాయిధరమ్ తేజ్,దేవీ శ్రీ సంగీతం,ఫస్టాఫ్. తనదైన నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు సాయిధరమ్ తేజ్. తన కెరీర్‌లోనే ఢిపరెంట్ రోల్ పోషించిన తేజు మంచి టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్‌తో ఇరగదీశాడు. కళ్యాణి అందం,నివేదా అభినయం సినిమాకు మరో ప్లస్. వీరిద్దరు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సునీల్,వెన్నెల కిషోర్ తమదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. పోసాని క్రిష్ణమురళి ఎంత చెప్పినా తక్కువే. తన పాత్రకు ప్రాణం పోశాడు. మిగితానటీనటులు పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్::

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ రోటిన్ కథ,సెకండాఫ్.ఫస్టాఫ్‌లో కామెడీ,ఎమోషన్స్‌తో హైప్ క్రియేట్ చేసిన దర్శకుడు కిషోర్ తిరుమల సెకండాఫ్‌ను అంతేఅందంగా తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడు. దీనికి తోడు స్లో నెరేషన్ విసిగిస్తుంది.

chitralahari

సాంకేతికవిభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. దేవీశ్రీ ప్రసాద్ డీసెంట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌,పాటలు బాగున్నాయి. రోటిన్ కథే అయినా కొత్తదనాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు కిషోర్ తిరుమల.ఫస్టాఫ్‌లో ఎమోషన్స్, కామెడీ బాగుంది. ఎడిటింగ్,సినిమాటోగ్రఫీ పర్వాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

వరుసగా ఐదు ఫ్లాప్‌ల తర్వాత నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమలపై భారీ ఆశలతో సాయిధరమ్ చేసిన ప్రేమకథా చిత్రం చిత్రలహరి. సాయిధరమ్ నటన,కామెడీ సినిమాకు ప్లస్ కాగా రోటిన్ కథ,స్లో నెరేషన్ మైనస్ పాయింట్స్. మొత్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకువచ్చిన తేజు చిత్రలహరితో పర్వాలేదనిపించాడు.

విడుదల తేదీ:12/04/2019
రేటింగ్:2.5/5
నటీనటులు:సాయిధరమ్ తేజు,నివేదా,కళ్యాణి
సంగీతం:దేవీ శ్రీ ప్రసాద్
నిర్మాత:మైత్రీ మూవీ మేకర్స్
దర్శకత్వం:కిషోర్ తిరుమల

glassmates

- Advertisement -