పవన్ కళ్యాన్, చిరంజీవి మాట్లాడుకోవడం లేదంటూ గత కొన్నిరోజులుగా ఫిల్మ్‌నగర్‌లో వార్తలు జోరందుకున్నాయి. వీరి మధ్య ఏదో జరిగిందని అందుకే మెగాబ్రదర్స్ విడిపోయారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాన్ జనసేన పార్టీ పెట్టడంతోనే మెగా ఫ్యామిలీ పవన్‌ను దూరంపెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి పవర్‌స్టార్ పవన్ కళ్యాన్‌కు ఫోన్ చేశాడట. దీనికి కారణం కాటమరాయుడు టీజర్ విషయంలో అభినందనలు తెలపడానికే చిరు పవన్‌కు ఫోన్ చేశడట. కాటమరాయుడు టీజర్ చాలా బాగుందని తనకెంతో నచ్చిందని చెప్పి పవర్‌స్టార్‌ను చిరంజీవి అభినందించాడట. ఇక రాంచరణ్ కూడా తన ట్వీట్టర్‌లో కాటమరాయుడు టీజర్ సూపర్‌గా ఉందని బాబాయ్ పవన్‌కళ్యాన్ ఈటీజర్ లో చాలా బాగునున్నడని ప్రశంసించాడు. కాటమరాయుడి టీజర్‌పై మెగా హీరోలందరు చాలా పాజిటివ్‌గా ట్వీట్లు చేస్తున్నారు.
ఇలా తన అన్నయ్య చిరు దగ్గరి నుంచి ఫోన్ రావడంతో చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడట పవర్‌స్టార్ పవన్ కళ్యాన్ . ఇప్పటికే ‘కాటమరాయుడు’ టీజర్ యూట్యూబ్‌లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం విడుదలైన ఈ టీజర్ కేవలం రెండు గంటల్లోనే మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ఇది చూసిన పవర్‌స్టార్ అభిమానులు కాటమరాయుడు సినిమా హిట్ అవ్వడం ఖాయమని తమ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.