ప్రతిపక్షాలవి అర్ధం లేని ఆరోపణలు…

429
MLA Chirumarthi Lingaiah
- Advertisement -

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని పాలకేంద్రంలో మీడియాతో మాట్లాడారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య , టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కెలపల్లి రవీందర్ రావు .ఈ సమావేశంలో ఎమ్మెల్యే చిరుమర్తి రవిధర్ రావు లు మాట్లాడుతూ ….శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత దురదృష్టకరం….ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం చాలా బాధాకరం…ప్రమాధంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అని వెల్లడించారు.

మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను….ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా…ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది…అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి గారు సంఘటన స్థలానికి చేరుకొని అధికారులను అప్రమత్తం చేసి, తక్షణ సహాయక చర్యలు చేపట్టారు..ఈ ప్రమాదం పై కాంగ్రెస్, బిజెపి చేస్తున్న ఆరోపణలు సరైనవి కావు..ఈ కేసును సీబీసీఐడి విచారణకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీచేశారు.

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లో జరిగిన అగ్ని ప్రమాదం ఈ సంఘటన పట్ల సానుభూతి వ్యక్తం చేయాల్సిన సమయం లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు…

కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల అభివృద్ధి కొరకు అనేక రకాల సంక్షేమ పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంటే రేవంత్ రెడ్డి మరియు మరికొంత మంది బిజెపి నాయకులు ఓర్వలేక అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారు,మీ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

- Advertisement -