మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో జోష్ పెంచారు. రీసెంట్‌గా భోళా శంకర్‌తో కాస్త నిరాశపర్చినా తన తర్వాతి ప్రాజెక్టులపై ఆచితూచి ముందుకెళ్తున్నారు. వరుస ఫ్లాప్‌లు మూట గట్టుకుంటే చిరు ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండటంతో అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
అందుకే తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఫాంటసీ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి ఫాంటసీ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే రిలీజైనా పోస్టర్ ఆకట్టుకుంది. ఇక తర్వాత సోగ్గాడే చిన్ని నాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో మూవీ చేయనున్నారు.
ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత బోయపాటి శ్రీనివాస్‌తో మూవీ చేయనున్నారు. బోయపాటి సినిమాలు అంటేనే మాస్,యాక్షన్ ఎంటర్‌టైనర్.బోయపాటి చెప్పిన కథ నచ్చడంతో చిరు వెంటనే ఓకే చెప్పారట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుండగా పాన్ ఇండియా సినిమాగా రానుందట.
Also Read:KTR:ఆ హామీల సంగతేంటి..?