పవన్‌కు ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం: చిరు

2
- Advertisement -

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన చిరు..కళ్యాణ్ బాబు…ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం…ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు అని కొనియాడారు.

రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు.అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు ,దీర్ఘాయుష్మాన్ భవ అని వెల్లడించారు చిరు.

 

Also Read:హ్యాపీ బర్త్ డే..డిప్యూటీ సీఎం పవన్

- Advertisement -