మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్న చిరు…తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా అందరీకి శుభాకాంక్షలు తెలిపారు.
తాను హనుమంతుని భక్తునిగా ఎలా మారానో అభిమానులతో పంచుకున్నారు. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది…చిన్నప్పటి నుంచి…1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు.
హనుమాన్ బొమ్మ తన దగ్గర ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?.. ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, “ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి” అన్నారు. అప్పటి నా ఫోటో అన్నారు.
కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద reproduce చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …? pic.twitter.com/A2lqoazwcJ
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020
బాపు గారు చెప్పిన మాట "ఏంటోనండి …బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి …అలానే ఉంచేసాను …మార్చలేదు " అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఇవ్వాల్టి తారీఖుతో కూడా నాకు అనుబంధం ఉంది…#8thApril …to be continued. pic.twitter.com/m3J6S1ZEMs
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020