చిరు..విశ్వంభర లేటెస్ట్ అప్‌డేట్!

17
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మెగా అభిమానులకు, సినీ అభిమానులకు చిరస్మరణీయమైన చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని వశిష్ట అద్భుతంగా వినియోగించుకుంటుండగా, యువి క్రియేషన్స్ రాజీపడకుండా భారీ కాన్వాస్‌పై సినిమాను నిర్మిస్తోంది. చిరంజీవి సరసన ఏజ్ లెస్ దివా త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోండగా 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

ప్రస్తుతం చిరుతో పాటు హీరోయిన్ ఆషికా రంగనాథ్ మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వశిష్ట. విజువల్ వండర్ లా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్.

విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని నిర్మిస్తుండగా ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Also Read:ICC Rankings:పాండ్యా నెంబర్ 1

- Advertisement -