AP:కూటమికి జై కొట్టిన చిరు

15
- Advertisement -

ఏపీ ఎన్నికల రాజకీయ రణక్షేత్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్‌ కామెంట్స్ చేశారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతివ్వాలని కోరారు చిరు. ఇందుకు సంబంధించి బీజేపీ నేత సీఎం రమేష్‌తో కలిసి వీడియోని రిలీజ్ చేశారు.

పవన్ కళ్యాణ్-చంద్రబాబు-మోడీ కూటమిగా ఏర్పడటం సంతోషంగా ఉందన్నారు. ఇది చాలా మంచి పరిణామం. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేశ్, పెందుర్తి నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ ను గెలిపించాలని కోరారు. ఇద్దరూ చాలా సమర్థవంతులు. మంచివారు. ఏపీ అభివృద్ధిలో ముందుకెళ్లాలి. అందుకోసం ప్రజలంతా నడుం బిగించాలన్నారు. చిరు రిలీజ్ చేసిన వీడియో మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

Also Read:5 స్థానాల్లో అభ్యర్థుల మార్పు..మరో 2 పెండింగ్!

- Advertisement -