ఏపీలో ‘చిరు’ మంట..వ్యూహమేనా?

39
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో పెను దుమరాన్ని రేపుతున్నాయి. రాజకీయాల నుంచి బయటకు వచ్చిన తరువాత అసలు పాలిటీక్శ్ ప్రస్తావన తీసుకురావడానికి ఇష్టపడని చిరు.. ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మంట పుట్టిస్తున్నాయి. వాల్తేరు వీరయ్య 200 డేస్ సక్సస్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై, అలాగే ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు పై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఇటీవల రిలీజ్ అయిన బ్రో సినిమాలో తన క్యారెక్టర్ ను వాడుకున్నారని అంబటి రాంబాబు గత నాలుగైదు రోజులుగా నానా హైరానా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చిరు మాట్లాడుతూ ” కొందరు అనవసర విషయాలపై రాద్దాంతం చేస్తున్నారని, మీలాంటి వాళ్ళు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని, రోడ్ల నిర్మాణం, ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ, ఉపాధి కల్పనా వంటి వాటి గురించి ఆలోచించాలని,వ్యాఖ్యానించారు చిరు. అంతే కాకుండా పెద వారి కడుపు నింపే దిశగా ఆలోచిస్తే అందరూ తలవంచి నమస్కరిస్తారని, అలా కాకుండా పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేందుకు అంటూ పరోక్షంగా జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటుగా మాట్లాడారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Also Read:వామ్మో..గుడ్డు పెంకులతో ఎన్ని లభాలో..!

ప్రభుత్వాలు ఎలా ఉండాలో కొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారని.. అలాంటి వారి వారి సినిమాలపై దృష్టి సారిస్తే బాగుంటుందని మాజీమంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. సినీ ఇండస్ట్రీని పిచ్చుకలా చిరు భావిస్తున్నారా అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇంకా గుడివాడ అమర్నాథ్, పెర్ని నాని, అంబటి రాంబాబు వంటి వారు సైతం చిరు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎప్పుడు లేని విధంగా చిరు ఇప్పుడు రాజకీయాలపై ప్రస్తావించడం ఎంటనే చర్చ కూడా జరుగుతోంది. చిరు జనసేన పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయాలు తనకు సెట్ కావని వాటి జోలికి వెళ్ళే ప్రసక్తే లేదని చిరు గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనప్పటికి మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి.

Also Read:చైనాను దాటం..సమస్యలు అధిగమిస్తామా?

- Advertisement -