రంగస్ధలం…అందరిని మెప్పిస్తుంది

220
- Advertisement -

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `రంగ‌స్థ‌లం`. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ వైజాగ్ ఆర్‌.కె.బీచ్‌లో ఘనంగా జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా…మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – “తెలుగు ప్ర‌జ‌ల‌కు, మెగాభిమానుల‌కు ఉగాది శుభాకాంక్ష‌లు. నాకు వైజాగ్‌తో మంచి అనుబంధం ఉంది. ఈ న‌గ‌రాన్ని, ఇక్క‌డి అభిమానుల్ని చూస్తుంటే నేను ప్రారంభంలో చేసిన ఆరాధ‌న‌, అభిలాష‌, ఘ‌రానామొగుడుసినిమాలు గుర్తుకు వ‌స్తున్నాయి. అప్ప‌ట్లో బంగారు భ‌విష్య‌త్ గురించి ఆలోచించుకుంటూ వైజాగ్ అంత‌టా తిరిగిన రోజులు గుర్తుకు వ‌స్తున్నాయి. రేపు రిటైర్డ్ అయిన త‌ర్వాత వైజాగ్‌లోనే ఉండాల‌నిపిస్తుందన్నారు.

నిర్మాత‌లు విజ‌య‌వంత‌మైన సినిమాలు చేసి వారికంటూ ఓ బ్యాన‌ర్ వేల్యూను క్రియేట్ చేసుకున్నారు. ప్ర‌తి హీరో వారితో సినిమా చేయాల‌నుకుంటున్నారంటే వారెంత మంచి నిర్మాత‌లు అర్థం చేసుకోవ‌చ్చు. దేవిప్ర‌సాద్, త్రివిక్ర‌మ్ రావు, అశ్వ‌నీద‌త్, అల్లు అర‌వింద్‌ వంటి స్టార్ నిర్మాత‌ల స్థాయి నిర్మాత‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌. చ‌ర‌ణ్ ఎప్పుడూ వారి గురించే చెబుతుండేవాడు. ఈ సినిమా వారికి హ్యాట్రిక్ హిట్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. సుకుమార్ అద్భుతమైన ప‌నిత‌నాన్ని చూపించాడు. ప్యూర్ విలేజ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా ఇది. త‌ను నాకు చెప్పిన‌ప్పుడు ఎలాచెప్పాడో.. అంతే ప్యూర్‌గా ఈ రోజు ఎమోష‌న‌ల్‌గా సినిమాను తెర‌కెక్కించాడు. ఫ‌స్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను సినిమా క‌ట్టి ప‌డేస్తుంది. సినిమాను నేను ఎంజాయ్ చేసి చూశాను. ప్రేక్ష‌కులంద‌రినీ అల‌రించే సినిమా అవుతుంది. నాకు ఖైదీ సినిమా ఎలాగో.. రామ్‌చ‌ర‌ణ్‌కి ఇది స్టార్‌స్టేట‌స్‌ను పెంచే సినిమా అవుతుంది. త‌ను పెర్ఫామర్‌గా ఎదిగే సినిమా అవుతుంది.

సుకుమార్‌.. చ‌ర‌ణ్‌తో ఇంత మంచి సినిమా చేసినందుకు ఆర్టిస్ట్‌గా ఈర్ష్య ప‌డుతున్నాను. ఓ తండ్రిగా గ‌ర్వ‌ప‌డుతున్నాను. సుకుమార్ గ్రామంలో పుట్టి పెర‌గ‌డం వ‌ల్ల ఎమోష‌న్స్ మిస్ కాకుండా చ‌క్క‌గా తీశాడు. సినిమాలో ఓ క‌న్విక్ష‌న్‌తో నేచుర‌ల్‌గా సాంగ్స్‌ను తెర‌కెక్కించాడు. హీరో క్యారెక్ట‌ర్‌ను డీ గ్లామ‌రైజ్ చేయించి ..చ‌ర‌ణ్‌కెరీర్‌లో ఓ త‌ల‌మానిక‌మైన సినిమాను చేసిన సుకుమార్‌కి నా అభినంద‌న‌లు. సుకుమారే ఈ సినిమాకు క‌ర్త‌,క‌ర్మ‌, క్రియ‌గా సినిమాను ముందుకు న‌డిపించాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ చాలా అద్భుత‌మైన బాణీల‌ను అందించాడు. నాలుగు రోజుల్లో అంత మంచి సాంగ్స్ ఇచ్చాడ‌ని తెలిసి ఆశ్చ‌ర్య‌పోయాను. చంద్ర‌బోస్‌గారు అద్భుత‌మైన సాహిత్యాన్ని అందించారు. నెటివిటీకి అనుగుణంగా అంద‌మైన పాట‌ల‌ను అందించారు. ర‌త్న‌వేలుగారు ప్ర‌తి స‌న్నివేశాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. రామ‌కృష్ణ‌, మోనిక‌గారు అద్భుత‌మైన సెట్ వేశారు. ఆ సెట్ రియ‌ల్ లోకేషన్‌లా అనిపించింది. త‌న‌కు ఈ సినిమాతో అవార్డులు రావ‌డం ఖాయం. ఆది డిగ్నిటి ఉన్న పాత్ర‌లో అత్య‌ద్భుతంగా నటించాడు. చ‌ర‌ణ్ గ‌ర్వ‌పడేలా సినిమాలో న‌టించాడు. చాలా ఇన్టెన్స్‌తో న‌టించాడు. స‌మంత పాత్ర‌లో ఒదిగిపోయింది. జ‌గ‌ప‌తిబాబుగారు సెటిల్డ్ రోల్ చేశారు., ప్ర‌కాశ్ రాజ్‌గారి పాత్ర‌, అన‌సూయ చేసిన అత్త‌పాత్ర స‌హాఅన్నీ పాత్ర‌లు మెప్పిస్తాయి. ఈ సినిమా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. అన్ని విభాగాల్లో అవార్డుల‌ను సొంతం చేసుకుంటుంది. జాతీయ‌స్థాయిలో కూడా అవార్డువ‌చ్చినా ఆశ‌ర్య లేదు. జాతీయ అవార్డులు వ‌స్తుంద‌ని.. రావాల‌ని ..రాకుంటే అన్యాయం జ‌రిగిన‌ట్లే. 2018లో ఈ సినిమా అత్య‌ద్భుత‌మైన సినిమా అవుతుంద‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

- Advertisement -