పవన్ పై ఆ ఇద్దరి ట్వీట్లు వైరల్

44
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. తమ అభిమాన కథానాయకుడికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, సాధారణ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా పోటీ పడ్డారు. అయితే, పవన్ గురించి ఓ ఇద్దరు సినీ ప్రముఖులు చేసిన ట్వీట్లు మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో తెలుసా ?, ఒకరు పవన్ కి గాడ్ ఫాదర్ అయితే, మరొకరు పవన్ కి పరమ భక్తుడు. వాళ్లే మెగాస్టార్ చిరంజీవి – బండ్ల గణేష్. వీరిద్దరూ చేసిన ట్వీట్లను పవన్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ లైక్స్ కొడుతున్నారు.

ముందుగా నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ‘నా జీవితానికి వెలుగునిచ్చిన నా దైవం. మీరు అనుకున్నది సాధిస్తారు. సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పట్టుదల, కృషి, కసి దగ్గర నుంచి చూసిన మీ భక్తున్ని. మాకు మీరేంటో తెలుసు. విజయిభవ. మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై పవన్ కల్యాణ్‌, జై జై పవన్ కల్యాణ్‌ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

అలాగే తన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా తనదైన శైలిలో బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ప్రియమైన కళ్యాణ్ బాబు, జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.

- Advertisement -