మెగాస్టార్ ఇంట ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. నేడు వారి నామకరణ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరైన ఈ వేడుక తర్వాత చిరంజీవి స్వయంగా సోషల్ మీడియాలో తన మనవడు, మనవరాలి పేర్లను ప్రకటించారు.
మెగా కవలలకు శివ రామ్ కొణిదెల మరియు అన్వీర దేవి కొణిదెల అనే పేర్లు ఖరారు చేసినట్లు ఆయన వెల్లడించారు. మనవడికి పెట్టిన ‘శివ రామ్’ అనే పేరు రెండు గొప్ప వ్యక్తిత్వాల సమ్మేళనమని తెలిపారు. తన అసలు పేరు శివ శంకర వరప్రసాద్‌లోని ‘శివ’ ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక కాగా, రామ్ చరణ్‌లోని ‘రామ్’ ధర్మం, కరుణలకు సూచిక అని వివరించారు.
మనవరాలికి పెట్టిన ‘అన్వీర దేవి’ అనే పేరు దైవిక శక్తికి ప్రతిరూపమని, అమ్మవారి ఆశీస్సులతో ఈ పేరు పెట్టామని చెప్పారు. ఈ పేరు భయరహిత ధైర్యం, అచంచల నమ్మకాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. అపారమైన ఆనందంతో ఈ పేర్లను ప్రకటిస్తున్నామని, చిన్నారులకు అందరి దీవెనలు ఉండాలని భావోద్వేగంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read:12 ఏళ్ల టీ20 రికార్డు బ్రేక్!

