కళాతపస్వి కి ప్రముఖులు సంతాపం

41
- Advertisement -

కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) గురువారం రాత్రి మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. దాదాపు 50 కళాత్మక చిత్రాలు నిర్మించిన విశ్వనాథ్​కు 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. కాశీనాథుని విశ్వనాథ్ ప్రశస్తమైన సినిమాలు నిర్మించి తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చారు. కొన్ని చిత్రాలలో నటించారు కూడా. సౌండ్ ఇంజినీరుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఇక కళాతపస్వి మరణం పై సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

జూ. ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్ లో.. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నోచిత్రాలని ఆయన అందించారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నానని ఎన్టీఆర్ తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా సంతాపం వ్యక్తం చేస్తూ.. “తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు కాలం చేయడం కలిచివేసింది. ఆయన చనిపోయిన వార్త విని షాక్ కు గురయ్యాను. ఆయనలాంటి డైరెక్టర్ చనిపోవడం నాకే కాదు సినీపరిశ్రమకే తీరని లోటు” అని చిరంజీవి పేర్కొన్నారు.

మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తంచేస్తూ.. “సుప్రసిద్ధ దర్శకులు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. కళాతపస్విగా పేరు గాంచిన ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచి, మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -