చిరు 152లో కాటమరాయుడు..!

190
Chiru, Pawan Multistarrer with Trivikram..!
- Advertisement -

ఖైదీతో వందకోట్లు వసూల్ చేసిన చిరు తన 151వ సినిమాతో కూడా తన సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాంచరణ్‌ నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత చిరు…మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.  ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ అతిథి పాత్ర చేయ‌బోతున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్‌లో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం త్రివిక్ర‌మ్, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను అడిగిన‌ట్లు తెలుస్తోంది. దీని కోసం త్రివిక్ర‌మ్ రంగం సిద్ధం చేస్తున్నార‌ని టాలీవుడ్ వర్గాల టాక్.

Chiru, Pawan Multistarrer with Trivikram..!
గ‌తంలో శంక‌ర్ దాదా జిందాబాద్ చిత్రంలో ప‌వ‌న్ అతిథి పాత్ర పోషించారు. అయితే ఈ సినిమాలో అరగంట సేపు పవన్‌ కనిపించనున్నాడట. వైజయంతి బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం సిద్ధమవుతోంది. ఈ సినిమాకి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది.

- Advertisement -