టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జీవిత చరిత్ర త్వరలోనే పుస్తక రూపంలో రానుంది. విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. చిరు మాట్లాడుతూ.. నా జీవిత చరిత్రను రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు అప్పగించినట్లు చెప్పారు. ‘నా సినీ ప్రస్థానాన్ని ఆసక్తిగా రాయగల శక్తి యండమూరికే ఉంది. సమకాలీన రచయితలలో యండమూరికి సాటిలేరు’ అని చిరంజీవి అన్నారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి తన బయోగ్రఫీ తీసుకురాబోతున్నారు.
ఐతే, మెగాస్టార్ కి యండమూరికి మధ్య చాలా గ్యాప్ ఉంది. కొన్నాళ్ల పాటు ఇద్దరి మధ్య మాటలు కూడా లేవు. అలాంటిది ఉన్నట్టు ఉండి, తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతను మెగాస్టార్ చిరంజీవి, యండమూరి వీరేంద్రనాథ్‌కు అప్పగించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పైగా చిరంజీవి కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేశాడు. తాను పెద్ద స్టార్‌గా ఎదగడానికి యండమూరి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చిరు యండమూరిని కొనియాడారు.
ఆయన సినిమాలతోనే తనకు మెగాస్టార్ బిరుదు వచ్చిందన్నారు. ఆయన తన బయోగ్రఫీ రాస్తాననడం ఎంతో సంతోషంగా ఉందని చిరంజీవి వ్యాఖ్యానించారు. అన్నట్టు మెగాస్టార్ OTTలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఓటీటీలో స్టార్ హీరోల హవా నడుస్తోంది. ఇప్పటికే వెంకటేష్, నాగచైతన్య, బాలయ్య, మంచు మనోజ్, దగ్గుబాటి రానా వంటి హీరోలు వెబ్ సిరీస్లు, టాక్ షోలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ జాబితాలో చేరనున్నట్లు సమాచారం. పైగా తన బయోపిక్ తో చిరు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తారట.
Also Read:మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి : గీతానంద్