గాడ్ ఫాదర్‌..కాంబో రీపిట్!

20
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ మూవీ లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కీలకపాత్ర పోషించగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఇక తాజాగా మరోసారి చిరుతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశారు మోహన్ రాజా.

విశ్వంభర తర్వాత చిరు – మోహన్ రాజా కాంబోలో సినిమా షూటింగ్ ప్రారంభంకానుండగా ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. జూన్ మొదటి వారంలో ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రానుండగా రెగ్యులర్ షూట్ ఆగస్ట్ నుండి ప్రారంభంకానుంది.

ప్రస్తుతం చిరు… వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

Also Read:సన్‌రైజర్స్ సంచలన విజయం..

- Advertisement -