” చిరు ” మావాడే

28
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2009 లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి.. ఆ తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. దాంతో అప్పట్లో చిరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఇక ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత కాంగ్రెస్ తరుపున కేంద్ర మంత్రి గా కూడా కొన్నాళ్లు పని చేశారు. ఆ తరువాత ఆంద్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోవడం.. అటు కేంద్రంలోనూ ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలు కావడంతో చిరు రాజకీయాలపై దృష్టి తగ్గించి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే చిరు మూవీస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన తరువాత పాలిటిక్స్ కు పూర్తిగా దూరమయ్యారు.

ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు తనకు రాజకీయాలు సెట్ కావని, తనలాంటి వాళ్ళు అక్కడ రాణించడం కష్టమని చిరంజీవి చెబుతూ వస్తున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారా ? లేదా అనే దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు మెగాస్టార్ చిరంజీవి. కానీ కాంగ్రెస్ మాత్రం చిరు మావాడే అంటూ పదే పదే చెప్పుకొస్తుంది. ఆ మద్య పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు చిరుని ఆహ్వానించింది కాంగ్రెస్ అధిష్టానం. దాంతో చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారనే సంకేతాలను చెప్పకనే చెప్పింది కాంగ్రెస్ హైకమాండ్. ఇక తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని సరికొత్త చర్చకు తెరతీశారు. దీంతో చిరు మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా ? అనే గుసగుసలు పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ మద్య తన తమ్ముడు పవన్ పై జనసేన పార్టీ పై ప్రశంశలు కురిపిస్తున్నారు. దీంతో ఆయన త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఈ సందర్భంలో కాంగ్రెస్ నేతలు చిరు మావాడే అని చెప్తుండడంతో.. ఇంతకీ చిరు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేది ఆసక్తికరంగా నడుస్తున్న చర్చ. మరి ఒకసారి రాజకీయ రంగప్రవేశం చేసి ఘోరంగా విఫలం అయిన మెగాస్టార్.. మళ్ళీ అదే దారిలో వెళతారా ? లేదా మూవీస్ వరకే పరిమితం అవుతారా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి…

జగన్ సర్కార్ కు గట్టి దెబ్బ!

ఎకో టూరిజానికి ప్రోత్సాహం..

కొత్త పార్లమెంట్‌ భవనం అందాలు…

- Advertisement -