విశ్వంభర అప్‌డేట్ ఇచ్చిన చిరు!

6
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర. ఆగస్టు 22న చిరు బర్త్ డే సందర్భంగా స్పెషల్ అప్‌డేట్ ఇచ్చారు. విశ్వంభర సినిమా గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

మీ ముందుకు రావడానికి కారణం విశ్వంభర… చాలా మందికి డౌట్ ఉంది ఈ సినిమా ఎందుకు డిలే అవుతుంది అని. ఈ ఆలస్యం చాలా సముచితం అని నేను భావిస్తున్నాను అన్నారు. ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్, VFX మీదే ఆధాపడి ఉంది. ది బెస్ట్ క్వాలిటితోటి మీ ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతల ఆశయమే ఈ ఆలస్యానికి కారణం అన్నారు.

ఈ సినిమాని 2026 వేసవిలో మీ ముందుకు తీసుకువస్తున్నాం… నాది భరోసా అని తెలిపారు.

- Advertisement -