మాదాల రంగారావు తర్వాత విప్లవ సినిమాలకు కేరాఫ్ పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. ఒకప్పుడు ఆయన సినిమాలు వస్తున్నాయంటేనే ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూసేవారు. కానీ ప్రస్తుతం ఇందుకు భిన్నంగా మారింది ఆయన పరిస్థితి. మెసేజ్‌తో కూడిన సినిమాలు చేస్తున్న పెద్దగా ఆదరణ లభించడం లేదు.
అయితే తాజాగా ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉండగా మంగళవారం ఆడియో విడుదల కానుంది.
ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ వేడుక జరగనుందని చిరంజీవి విచ్చేస్తున్నారని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. భవిష్యత్తు తరాల మనుగడకి ఓటు ప్రాముఖ్యతను తెలియజేసే కథ, కథనాలతో ఈ సినిమా తెరకెక్కింది. స్నేహచిత్ర బ్యానర్‌పై పీపుల్స్ స్టార్ ఈ సినిమాను తెరకెక్కించారు.
నారాయణమూర్తి సినిమా కోసం మెగాస్టార్ వెళ్లడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. చిన్న సినిమాలను రక్షించడానికి మెగాస్టర్ రంగంలోకి దిగడంపై హర్షం వ్యక్తమవుతోంది.