ఫస్ట్ డే ఫస్ట్ షో.. ప్రీ రిలీజ్‌కి అతిథిగా చిరు

99
chiru
- Advertisement -

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ రొమ్-కామ్ ఎంటర్ టైనర్ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.‘జాతిరత్నాలు’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమాని రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 31న హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -