ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ: మెగాస్టార్ చిరు

171
chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా తన నాన్న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరు త‌న నాన్న‌తో దిగిన ఫొటోని షేర్ చేశారు.. మా నాన్న కి కోపం ఎక్కువ.. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ.. ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతల నెరవేర్చటం కోసం ప్రతి రోజు కష్టపడే నాన్నలందరికి ఫాద‌ర్స్ డే శుబాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మెగాస్టార్ ట్వీట్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది.

చిరంజీవి గ‌త ఏడాది క‌రోనా స‌మ‌యం నుండి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. చిరు చేసే ట్వీట్స్ కి కొద్ది నిమిషాల‌లోనే వేల కొల‌ది లైకులు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం చిరంజీవి ఆచార్య అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

- Advertisement -