అన్‌స్టాపబుల్..చిరు కూడా వస్తారు: బాలయ్య

87
nbk
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. సీజన్ 1 సక్సెస్‌ఫుల్‌గా పూర్తికాగా ఇక రెండో సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం విజయవాడలో ప్రత్యేకంగా లాంచింగ్‌ షో ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇటీవల చాలా మంది సినిమా వాళ్ళు టీవీలు, ఓటీటీకి వస్తున్నారు, మీరెప్పుడు వస్తారు అని అభిమానులు నన్ను కూడా అడగడంతో అభిమానుల కోసమే ఈ షో చేశాను. ప్రపంచవ్యాప్తంగా ఈ షోని బాగా ఆదరించారు. అందుకే మరో సీజన్ చేస్తున్నాము అని తెలిపారు.

ఇక ఈ షోకి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వస్తారా అనే ప్రశ్నకి బదులిస్తూ.. వాళ్లంతా రావొచ్చు. అది వాళ్ళ ఇష్టాన్ని, సమయానుకూలాన్ని బట్టి ఉంటుంది. అది ఆహా నిర్వాహకులు ప్లాన్ చేయాలి. వస్తే మంచిదే అని తెలిపారు.

- Advertisement -