రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత బన్ని చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథం(డీజే). హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 11న(రేపు) హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరగనుంది.
ఈ ఆడియో వేడుకకి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు.ఇప్పుడే చైనా టూర్ వెళ్ళి వచ్చిన చిరంజీవి.. అంతలోనే దువ్వాడ జగన్నాధం టీమ్ ఆహ్వానాన్ని కాదని అనలేక సరే అన్నారట. జూన్ 11 న శిల్పకళా వేదిక హైదరాబాద్ లో జరగనున్న ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిదిగా వస్తున్నారు. మెగా స్టార్ రాకతో ఈ ఈవెంట్ కు ఇప్పుడు ఉన్న దానికన్న ఇంకా క్రేజ్ పెరిగింది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జతగా పూజ హెగ్డే నటిస్తుంది. దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ దగ్గరి నుంచి పాటలు,ట్రైలర్ వరకు అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన రెండు రోజుల్లోనే 10 మిలియన్స్ వ్యూస్‌తో ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటుంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అంతా దాదాపుగా పూర్తి అయింది ఇంకా ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే మిగిలిఉంది అని తెలుస్తుంది. ఇది కూడా రానున్న రెండు రోజులలో పూర్తి అవుతుంది అని చెబుతున్నారు.