మంత్రి కేటీఆర్‌కి చిరంజీవి ఛాలెంజ్…!

473
chiru ktr
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కి బీ ది రియల్ మెన్ ఛాలెంజ్‌ని విసిరారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ ఛాలెంజ్ ట్రెండ్‌గా మారగా చిరుకి ఛాలెంజ్ ఇచ్చారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన మెగాస్టార్ ఈ వీడియోని షేర్ చేశారు. ఇది నీ కోసం భీం.. నేను రోజు చేసే పనులే…ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం అంటూ తాను ఇంట్లో చేస్తున్న ప‌నుల‌కి సంబంధించిన వీడియో షేర్ చేశాడు.

త‌ల్లి కోసం చిరు స్పెష‌ల్ దోశె వేయగా, ఎంతో ప్రేమ‌గా త‌న త‌ల్లి తినిపిస్తుంటే చిరు దానిని ఆస్వాదిస్తూ క‌నిపించారు.అంతేగాదు దీనికి కొనసాగింపుగా మంత్రి కేటీఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్‌ని సవాల్ స్వీకరించాల్సిందిగా కోరారు చిరు.

- Advertisement -