చెర్రీకి చిరు బర్త్‌డే విషెస్‌.. పిక్‌ వైరల్‌..

87
- Advertisement -

ఈరోజు మెగా ఫ్యాన్స్ కు పండుగ రోజు… అదే మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ బర్త్ డే. ఈ మెగా హీరో ఇవాళ 38వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ పుట్టినరోజు చెర్రీకి చాలా స్పెషల్ అనే చెప్పాలి. గత శుక్రవారం విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘రాజమౌళిగారి ఆర్ఆర్ఆర్’ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. వెలకట్టలేని ఈ పుట్టినరోజు కానుకును ఎంతో బాధ్యతతో స్వీకరిస్తా’’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

చెర్రీ బర్త్ డే ను పురస్కరించుకొని పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి.. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘రాంచరణ్ కి సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది.

అయితే ఈ అకేషన్‌లో రామ్ చరణ్ పిక్ ఒకటి షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది.. అంటూ ‘స్వయంకృషి’ షూటింగ్ టైమ్‌లో చిన్నారి చెర్రీని చిరు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్న ఫోటో ను, ‘ఆచార్య’లో ఇద్దరూ కలిసి నటించిన ఒక సన్నివేశంలోని లొకేషన్ పిక్ ను షేర్ చేస్తూ.. కొడుకుగా వాడు నన్ను గర్వపడేలా చేస్తున్నాడు. వాడు నాకు గర్వకారణం అని చిరంజీవి ట్వీట్ చేశారు.

- Advertisement -