మెగాస్టార్ చిరంజీవి…నందమూరి బాలకృష్ణ సంక్రాంతి సమరానికి సిద్ధమై పోయారు. దీంతో సంక్రాంతికి టాలీవుడ్లో పోరు రసవత్తరంగా మారింది. ఖైదీ నెం. 150 షూటింగ్ కాస్త ఆలస్యంగా మొదలైంది గానీ మొదలైన తర్వాత ఎక్కడా ఆగలేదు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావొచ్చింది. కణల్ కణ్ణన్ ఆద్వర్యంలో క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు వినాయక్.
ఇక బాలయ్య కూడా తక్కువేం తినలేదు. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక కథాంశాన్ని ఏడు నెలల్లోనే పూర్తి చేసి…చిరుకి సవాల్ విసిరేందుకు రెడీ అంటున్నాడు.ఈ ఇద్దరూ ముందు నుంచే ఫిక్సైపోయారు పండక్కి కొట్టుకోవాలని. అయితే బాలయ్య – చిరంజీవి ల సంక్రాంతి వార్ రిజల్ట్ ఇంకా సంక్రాంతి రాకుండానే ఈ వారమే బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ టీజర్ ఈనెల 8వ తారీఖు సాయంత్రం విడుదల అవుతూ ఉంటే చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ టీజర్ 9వ తారీఖు ఉదయం విడుదల కాబోతోంది. దీంతో కొన్ని గంటల తేడాతో జరగబోతున్న ఈ టీజర్ వార్ లో ఎవరు ఆధిపత్యం ప్రదర్శిస్తారు అన్న ఆసక్తి ఈ టాప్ హీరోల అభిమానులలో విపరీతంగా పెరిగిపోతోంది. బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టీజర్ మన ఇరు రాష్ట్రాలలోని 100 ధియేటర్లలో విడుదల అవుతూ ఉంటె ‘ఖైదీ’ టీజర్ రామ్ చరణ్ ‘ధృవ’ ప్రదర్సించే అన్ని దియేటర్లలోను ప్రదర్శింప బడబోతోంది.
దీనితో ఈ వారంతానికే చిరంజీవి బాలకృష్ణల మెగా ఫైట్ లో ప్రాధమిక పోటీలో ఎవరు ఎవరి పై ఆధిపత్యం సాధించారు అన్న విషయమై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈనెల 16న జరగబోతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ అత్యంత ఘనంగా జరపడానికి చాల భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.