సుమకు చుక్కలు చూపించిన చిరు!

59
- Advertisement -

ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్‌గా సుమ అడ్డా అనే షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోకి తొలిగెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. చిరుతో పాటు దర్శకుడు బాబీ, వెన్నెల కిషోర్ హాజరయ్యారు. ఈ షో ఆధ్యాంతం చిరు పసిపిల్లాడిలా పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తూ అందరిని ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా సుమ తాను హోస్ట్‌గా వ్యవహరించే షోలో మాటల తూటాలు పేలుస్తూ ఇతరులను మాట్లాడకుండా చేస్తుంది. కానీ చిరు వచ్చిన ఈ షోలో అవాక్కయి చూడటం సుమ వంతైంది. సుమపై చిరు వేసిన పంచ్‌లకు ఆమె కూడా బిత్తరపోయింది.

మా నాన్నని కూడా సినిమా షూటింగ్స్ బిజీ వల్ల చాలా మిస్ అయ్యాను. ఆయనతో గడిపిన టైం తక్కువ. ఆయన దూరం అయ్యాక, వెళ్ళిపోయాక చాలా మిస్ అవుతున్నాను. ఆయన తిరిగి వస్తే ఇప్పుడు మాత్రం ఆయనతోనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పారు చిరు. ప్రజెంట్ జనరేషన్ కి కూడా ఒకటే చెప్తున్నా. వాళ్ళు దూరమయ్యాక బాధపడటం కంటే ఇప్పుడే ఎంత బిజీగా ఉన్నా మీ తల్లి తండ్రులతో సమయం గడపండి. వాళ్ళతో గడిపిన సమయమే ఆ తర్వాత మనకి జ్ఞాపకాలుగా ఉంటాయి అంటూ ఎమోషనల్‌ అయ్యారు చిరు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -