‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నాటు నాటు పాట రాసిన చంద్రబోస్ ఆస్కార్ గెలుచుకున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ స్టార్ చిరంజీవి తాజాగా రచయిత చంద్రబోస్ ను తనదైన శైలిలో గౌరవించారు. భోళా శంకర్ సెట్స్ లో చంద్రబోస్ ను ఆప్యాయంగా సత్కరించి, చంద్రబోస్ కి వచ్చిన ఆస్కార్ అవార్డును తన చేతుల్లోకి తీసుకుని, చిరు ఎంతగానో మురిసిపోయారు. పైగా ఈ క్షణాలు తన లైఫ్ లో బెస్ట్ మూమెంట్స్ లో ఒకటి అంటూ చిరు చెప్పడం ఆకట్టుకుంది.
మరోవైపు చంద్రబోస్ కూడా మెగాస్టార్ పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అన్నయ్య కళ్ళల్లో ఇంత ఆనందం చూడడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, అలాగే అన్నయ్య ఎప్పుడూ తన చేతిని వదల్లేదు అని, కష్టకాలంలో తనను ఎంతో ప్రోత్సహించారు అని, తనతో మెగాస్టార్ ఎన్నో మంచి పాటలు రాయించారని, తన కలంకి చిరు వెలుగు పంచారు అని, అందుకే మెగాస్టార్ కి తాను రాసిన పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయని చంద్రబోస్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం చంద్రబోస్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తానికి ఆస్కార్ అవార్డు గ్రహీతగా చంద్రబోస్ చరిత్ర సృష్టించారు. తెలంగాణ సినీ గేయ సాహిత్యానికి విశ్వఖ్యాతిని తెచ్చిన ‘నాటు నాటు’ పాటతో సంగీతంలో హుషారెత్తించిన గీతంగా ప్రపంచ ప్రజల అభిమానాన్ని అందుకోవటం తెలంగాణ సమాజం గర్వించతగిందని చంద్రబోస్ కూడా పేర్కొన్నారు.
@boselyricist what a wonderful feeling that you gave the first ever Telugu words to be heard on the Oscar stage in 95 years!! 👏👏 Elated to relive those moments through you & heartened to welcome you home after the victorious march to the #Oscars95! 💐💐 #NaatuNaatu #RRRMovie pic.twitter.com/9Zt3biQCiD
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 30, 2023
ఇవి కూడా చదవండి..