సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌గా ఘనంగా జరుగగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు చిరు- విజయశాంతి.
ఈ నేపథ్యంలో మాట్లాడిన చిరంజీవి ఎమోషన్ అయ్యారు. విజయశాంతి గురించి మాట్లాడుతూ ఎప్పుడో ఇరవై ఎల్లా క్రితం నన్ను వదిలి వెళ్ళిపోయింది నా హీరోయిన్ మళ్లీ ఇన్నాళ్ళకు నాకు కనిపించింది. నువ్వు రాజకీయాల్లోకి వెల్లి ఎన్నాళ్ళు అయింది? అని అడిగారు విజయశాంతిని చిరంజీవి.
అంతేకాదు.. నువ్వు రాజకీయాల్లోకి నా కంటే ముందు వెళ్ళవు కదా.. మరి వెనుక వచ్చిన నన్నెందుకు తిట్టావు? అని సూటిగా అడిగారు. దీనికి తొలుత విజయశాంతి షాక్ అయినా తర్వాత రాజకీయాలు కదా అన్నారు. అయితే దీనికి చిరు స్పందిస్తూ నేను ఎప్పుడన్నా చిన్న మాట నిన్ను అన్నానా? లేదు కదా.. మరి నువ్వెందుకు నన్ను అన్నావు అంటూ మళ్ళీ ప్రశ్నించారు. తర్వాత ఇద్దరు ఆలింగనం చేసుకుని కలిసిపోయారు.
ఏది ఏమైనా రాజకీయాల వల్ల శత్రువులు పెరిగితే సినిమాల వల్ల మిత్రులు దగ్గరవుతారని, ఈ వేడుక ద్వారా విజయాశాంతి మళ్లీ తనకు దగ్గరైందని, ఈ క్రెడిట్ మహేష్‌బాబుదే అని చెప్పారు చిరంజీవి.