అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్‌లో ఇది 157వ సినిమా కాగా చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా తన మార్క్ మిస్ అవకుండా ఎప్పటిలాగే అనిల్ ఓ కాన్సెప్ట్ వీడియోని రిలీజ్ చేశారు. నయన్ – అనిల్ ఇద్దరూ చిరు స్టైల్‌లో సిగ్నేచర్ ఇచ్చిన వీడియో అందరిని ఆకట్టుకుంటోంది.
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. చిరంజీవికి సంబంధించిన లుక్ టెస్ట్ ని రీసెంట్‌గా మేకర్స్ కంప్లీట్ చేశారట. మెయిన్ గా వింటేజ్ లుక్ ని ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇలా ప్రస్తుతానికి మెగాస్టార్ లుక్ లాక్ చేసుకొని షూటింగ్ ని సన్నద్ధం కానున్నట్టు తెలుస్తుంది. భీమ్స్ సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.
Also Read:బలగం సినిమా రిపీట్..

