చిరు 154..వాల్తేరు వీరయ్య!

269
chiru
- Advertisement -

ఆచార్య తర్వాత వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో ఒకటి బాబి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా ఒకటి. ఇది చిరు కెరీర్‌లో 154వ సినిమా కాగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. చిరు సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. వాల్తేరు వీరయ్య, మాస్ మూలవిరాట్టు అని ప్రచారం జరుగుతుండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో టైటిల్‌ని రివీల్ చేశారు శేఖర్ మాస్టర్‌.

తన తర్వాతి ప్రాజెక్టుల గురించి చెబుతూ తమిళంలో రెండు ప్రాజెక్ట్ లు, మెగాస్టార్‌తో భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాలు చేస్తున్నా అని నోరు జారాడు. దీంతో మెగా 154 టైటిల్ పేరు లీక్ కావడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. అయితే అధికారికంగా సినిమా పేరును ఎప్పుడు ప్రకటిస్తారో వేచిచూడాల్సిందే.

- Advertisement -