చిరు కొరటాల మూవీలో హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలుసా?

242
chiru koratala
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా మూవీలో బిజీగా ఉన్నారు. ప్రముఖ స్వాతత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈసినిమాను అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు.

ఈసినిమా తర్వాత చిరు కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఈచిత్రం రెగ్యూలర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభంకానుంది. ఈచిత్రంలో చిరు సరసన హీరోయిన్ కోసం వెతుకుతున్నారు చిత్రయూనిట్. అనుష్క, తమన్నా, నయనతార ఇలా పలువురి పేర్లను పరిశీలించారు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం నయనతారను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

అయితే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని..అందులో నయనతార లీడ్ రోల్ లో కనిపించనుందని సమచారం. నయనతారా చిరుతో సైరా మూవీలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈమూవీలో యాంకర్ అనసూయ కూడా ప్రత్యేక మైన పాత్రలో కనిపించనుంది. ఈసినిమాను రామ్ చరణ్ తో పాటు మ్యాట్నీ మూవీస్ సంస్ధ కూడా నిర్మిస్తుంది.

- Advertisement -