‘సైరా నరసింహారెడ్డి’ ఇది మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీ. ‘ఖైదీ150’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు చిరు. కారణం ఖైదీగా మారిన చిరు అంతగా ప్రేక్షకులను మెప్పించకపోవడమే. అందుకే ఇప్పుడు చిరు నుంచి వచ్చే మూవీ మామూలుగా ఉండకూదనేది అభిమానులతో పాటు చిరు అభిప్రాయం కూడా.
అయితే ‘ఖైదీ150’ తర్వాత సైరాకు కమిట్ అయిన చిరంజీవికి ఇబ్బందులు తప్పట్లేవు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈమూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. కానీ తదుపరి షెడ్యూల్ దగ్గరే తడబడుతోంది సైరా. చిరూ కెరిర్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఫస్ట్ షెడ్యూల్‌లో ఎక్కడో ఏదో తేడా కొట్టేసిందంటూ పుకార్లు వినిపించాయి.
అయితే సైరా ఫస్ట్ షెడ్యూల్ లో మిగిలిన యాక్షన్ సీన్లను ఈ నెల 5,6,7 తేదీల్లో చిన్నషెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ ఇది వాయిదా పడింది. ఈ తేదీల్లో ఈ సినిమాకి కమిట్ అయిన వాళ్ళడేట్స్ దొరకడం లేదంటూ ఎప్పటిలాగే ఈ షెడ్యూల్‌కూడా పోస్ట్‌పోన్ అయింది. దాంతో సైరాకు సంబంధించి ఏదో ఒక లీక్ రావడం కామన్ అయిపోయింది.
ఇదిలా ఉంచితే..లీక్‌లతోనే వార్తల్లోకి వస్తున్న సైరా సెట్స్‌మీదకి మాత్రం సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళలేకపోతోంది. కానీ అసలువిషయం వేరే ఉందంటూ ఫిల్మ్‌నగర్‌లో జోరుగానే గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘సైరా’ ఫస్ట్‌షెడ్యూల్ విషయంలోనే చిరూ సంతృప్తిగా లేడని టాక్. అందులోనూ..సురేందర్‌రెడ్డి మేకింగ్,సన్నివేశాలపై చిరూ హ్యాపీగా లేడని తెలస్తోంది. అందుకే మరోసారి ఫస్ట్ షెడ్యూల్ నే కొనసాగించాలని అనుకున్నప్పటికీ ఇది కూడా కార్యరూపం దాల్చట్లేదు.
మరో వైపు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంకా ఫిక్స్‌కాని ఈ సినిమాకి ‘క్లైమాక్స్’ సీన్స్ చిత్రీకరించే టైం ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ కూడా డౌట్ పడుతున్నారు. చూడాలి మరి ‘సైరా’ ఏం చేస్తాడో.