బ్యాగ్రౌండ్ ఉంటే విజయాలు రావు…

230
Niharika_Konidela_
- Advertisement -

మెగా డాటర్ నిహారిక యాంక‌ర్‌గా, వెబ్ సిరీస్ న‌టిగా తెలుగు ప్రేక్షకులకు చేరువై.. ‘ఒక మనసు’ మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ నిరాశ పరచడంతో రెండో మూవీకి లాంగ్ గ్యాప్ తీసుకుని ‘హ్యాపీ వెడ్డింగ్’ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ వర్క్స్ జరుగుతుండగా.. కోలీవుడ్‌లోనూ తన సత్తా చాటేందుకు తమిళంలో ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ మెగా హీరోయిన్.

Niharika_Konidela_

అయితే నిహారిక తెలుగులో తను నటించిన మొదటి సినిమా ఒక మనసు సినిమా డిజాస్టర్‌ పై నిహారిక స్పందించింది. ఫ్యామిలి బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన విజయం అందుకోలేము. మెగా ట్యాగ్ ఉన్నా కూడా.. కంటెంట్ ఉంటేనే వర్కవుట్ అవుతుంది. నా నటనలో కొంత మార్పు రావాలి.. దానికి కోసం నేను పెద్దనాన్న, అన్నయ్యల దగ్గర సలహాలు, సూచనలు తీసుకుంటున్నాను అని వివరించింది.ప్రస్తుతం తమిళ్ లో నటిస్తున్నాను అని తెలుపుతూ..మా ఇంట్లో అందరికి తమిళ్ వచ్చు కానీ నాకు రాదు. ఇప్పుడిపుడే మాట్లాడటం నేర్చుకుంటున్నాని తెలిపింది.

Niharika_Konidela_

నిహారిక తమిళ్ లో ఆరు నల్ల నాల్ పాతు సోల్డ్రెన్ అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాలో నిహారిక కాలేజ్ గర్ల్ గా కనిపించనుంది. ‘ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌’అంటే తెలుగులో ‘ఒక మంచి రోజు చూసి చెబుతా’ అని అర్థం. కాగా ఈ మూవీ విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంది నిహారిక. కోలీవుడ్‌లో తన తొలిచిత్రాన్ని క్రేజీ కాంబినేషన్‌లో చేయడం ఆనందంగా ఉందని.. విజయ్‌సేతుపతి, గౌతమ్‌ కార్తీక్‌ స్టార్‌లతో పెద్ద బ్యానర్‌లో పనిచేయడం ఈ మూవీ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు నిహారిక. ఈ మూవీలో తన క్యారక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందన్నారు.

- Advertisement -