చిరు అల్లుడి తెరంగేట్రానికి రంగం సిద్దం

196
Chiranjeevi’s alludu Kalyan Grand Entry for Tollywood...
- Advertisement -

వెండితెరపై మెగా కుటుంబ నుంచి వచ్చిన హీరోలు చాలా మందే వున్నారు. తాజాగా చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరోవ్యక్తి ఆరంగేట్రానికి రంగం సిద్దమైంది. కొంతకాలంగా యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కల్యాణ్ హీరోగా కథ సిద్దమైంది.

వారాహి చలన చిత్రం పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన రాకేశ్‌ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. స్తారు.  రాకేశ్‌ చెప్పిన కథ నచ్చడంతో కల్యాణ్‌ ఈ చిత్రానికి పచ్చజెండా ఉపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రీప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

chiranjeevi
నటనపై ఆసక్తి కనబర్చడంతో కల్యాణ్‌కి శిక్షణ ఇవ్వమని చిరంజీవి ‘స్టార్‌ మేకర్‌’ సత్యానంద్‌ను కోరారట. గతంలో పవన్‌కల్యాణ్‌, రవితేజ, మహేశ్‌బాబు, ప్రభాస్‌, వరుణ్‌తేజ్‌, జయం రవి తదితర హీరోలు సత్యానంద్‌ వద్దే శిక్షణ తీసుకున్నారు.  చిరు కుటుంబం నుంచి టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న పదోవ్యక్తి కల్యాణ్ కావడం విశేషం.

- Advertisement -