- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఆచార్య’.ఈ సినిమా ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ వదిలారు మేకర్స్. ధర్మస్థలి చుట్టూ ఈ కథ నడుస్తుందనే విషయం ట్రైలర్‌లో చూడవచ్చు. యాక్షన్ కీ.. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ.. ప్రధానమైన పాత్రలను కలుపుతూ కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాలో రాం చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
సిద్ధ పాత్రలో చరణ్ కే అనిపించనుండగా, సోనూ సూద్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. చిరంజీవి సరసన కాజల్ నటించగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించారు. చిరూ – చరణ్ నక్సలైట్స్‌గా కనిపించనున్న ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ ఈ సినిమాను సంగీతాన్ని సమకూర్చారు.
- Advertisement -