ఓవర్సీస్ లో వీరయ్య రికార్డ్

23
- Advertisement -

టాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్ తో మెగా స్టార్ గా కొనసాగుతున్న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మాస్ ఎంటర్‌టైనర్‌తో సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రవితేజ పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్న ఈ మెగా చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించాడు.

యాక్షన్ ఎంటర్‌టైనర్ వాల్తేరు వీరయ్య ఇప్పటికే భారీ వసూళ్లతో సంక్రాంతి విన్నర్ అనిపించుకుంది. తాజాగా ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. USAలో ఈ సినిమా $2 మిలియన్ క్లబ్‌లో చేరింది. ‘ఖైదీ నంబర్ 150’ , ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత, US బాక్సాఫీస్ వద్ద ఈ అద్భుత ఫీట్ సాధించిన చిరంజీవి మూడవ సినిమాగా వాల్తేరు వీరయ్య నిలిచింది. ఈ వారం భారీ సినిమాల రిలీజ్ లేకపోవడంతో ఓవర్సీస్ లో ఇంకా వసూళ్లు అందుకునే అవకాశం కనిపిస్తుంది. వరల్డ్ వైడ్ గా 100 కోట్ల షేర్ కి దగ్గరలో ఉన్న ఈ సినిమా 120 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసి రిలీజ్ కి ముందే బజ్ క్రియేట్ చేశాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -