తేజ్ కి చిరు విషెస్..

41
chiru

సాయి ధరమ్ తేజ్ – నభా నటేష్ హీరో,హీరోయిన్లుగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న థియేట‌ర్స్‌లోకి రానుండగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు.

సినిమా విడుదల సందర్భంగా చిత్రయూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపిన చిరు… లాక్‌డౌన్‌ తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమా…ఈ మూవీకి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్ఫూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్‌ చేయాల్సిందిగా కోరుతున్నాను అంటూ ట్వీట్‌ చేశారు.