శ్రీరామ న‌వ‌మి.. చిరు ఆసక్తికర ట్వీట్..

70
chiru

ఈ రోజు శ్రీరామ న‌వ‌మి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు, తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు శ్రీరామ న‌వ‌మి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ట్విట‌ర్ ద్వారా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. హక్కుల కంటే బాధ్యత గొప్పద‌న్న‌ది రామతత్వం..కష్టంలో కలిసి నడవాలన్నది సీతాతత్వం. అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. పుణ్య దంపతులైన శ్రీ సీతా రాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం చిరు కొర‌టాల శివ డైరెక్ష‌న్ లో ఆచార్య చిత్రంలో న‌టిస్తున్నాడు.