మెగాస్టార్ చిరంజీవి – రవితేజ కలయికలో భారీ అంచనాలుతో వచ్చిన వాల్తేరు వీరయ్య మరీ సంక్రాంతి పోటీలో ఏ రేంజ్ లో ఆకట్టుకుందో చూద్దాం. ముందుగా కంటెంట్ విషయానికి వస్తే.. వాల్తేరు వీరయ్య (చిరంజీవి)కి విక్రమ్ సాగర్ (రవితేజ) సవతి తల్లి కొడుకు. వాల్తేరు వీరయ్య స్మగ్లర్ అయితే, విక్రమ్ సాగర్ ఏసీపీ అవుతాడు. ఒకపక్క వైజాగ్ లో వీరయ్య తన గ్యాంగ్ తో మందు బాటిల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అక్కడకి ఎసీపీగా వస్తాడు విక్రమ్ సాగర్. తమ దారులు కారణంగా అలాగే చిన్న తనంలో ఇద్దరి మధ్య జరిగిన కొన్ని పరిస్థుతులు కారణంగా ఇద్దరు దూరం అవుతారు. ఈ నేథ్యంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం వీరయ్య – విక్రమ్ మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి?, అసలు విక్రమ్ కి ఏం జరిగింది ?, అసలు వీరయ్య (చిరంజీవి) ఓ కేసు కోసం ఫైట్ చేస్తూ ఉంటాడు. ఏమిటి ఆ కేసు ?, మధ్యలో అతిధి (శ్రుతి హాసన్) ట్రాక్ ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినీమా చూడాల్సిందే.
మొత్తానికి భారీ అంచనాలతో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం ఇటు నవ్విస్తూనే అటు యాక్షన్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంటర్వెల్ లో బాబీ సింహాను చంపే సీన్ లో మెగాస్టార్ ఎలివేషన్స్, రవితేజ ట్రాక్, చిరు – రవితేజ మధ్య ఎమోషన్స్, క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ తల నరికే షాట్ అదిరిపోయాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగింది. మెగాస్టార్ కూడా తన కామెడీ టైమింగ్ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా మలేషియాలో శ్రుతి హాసన్ తో సాగే సీన్స్ ఫ్యాన్స్ కి నచ్చుతాయి.
ఇక తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటిలాగే మెగాస్టార్.. తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రధానంగా సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు,. బాబీ మార్క్ కామెడీ పంచ్ లు అండ్ మ్యానరిజమ్స్ సినిమాలో చాల బాగున్నాయి. మొత్తానికి పూనకాలు లోడింగ్ అంటూ వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ బాగుంది.
ఇవి కూడా చదవండి..