బ్లఫ్‌ మాస్టర్‌కి ఇంప్రెస్ అయిన చిరు!

246
chiranjeevi
- Advertisement -

బ్లఫ్ మాస్టర్ మూవీ చూసి ఫిదా అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. తన కుటుంబసభ్యులతో కలిసి సినిమా చూసిన చిరు…దర్శకుడు గోపి గణేశ్‌పై ప్రశంసలు గుప్పించారు. అద్భుతమైన సినిమా తీశావని దర్శకుడు గోపి గణేశ్‌పై ప్రశంసలు కురిపించారు.

తన నివాసంలో సుమారు గంటపాటు ఈ సినిమా గురించి చర్చించి..తనకిష్టమైన సినిమా సీన్లను చెప్పి ప్రశంసించారు. ఈ సందర్భంగా గోపి గణేశ్‌…చిరంజీవితో కలిసి ఫోటోదిగారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గోపి గణేశ్‌ దర్శకత్వంలో 2018లో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సత్యదేవ్‌, నందితా శ్వేత కాంబినేషన్‌ లో వచ్చిన ఈ సినిమాలో బ్రహ్మాజీ కీలక పాత్రలో నటించాడు.

- Advertisement -