మా వివాదం: చిరు వర్సెస్ రాజశేఖర్

598
chiru
- Advertisement -

మా అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ రసాభాసాగా మారింది. చిరంజీవి ప్రసాంగానికి అడ్డుతగిలిన రాజశేఖర్…చిరుపై తీవ్ర విమర్శలు చేశారు. మా అసోసియేషన్ వల్ల తన ఫ్యామిలీలో గొడవలు వచ్చాయని…అందుకే తన కారుకు యాక్సిడెంట్ జరిగిందని ఆరోపించారు. ఇండస్ట్రీలో నిప్పురాజుకుంటుందని మండిపడ్డారు.

అయితే రాజశేఖర్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు చిరంజీవి. ఉద్దేశపూర్వకంగానే రాజశేఖర్ ఇలా చేశాడని తన మాటకు విలువే ఇవ్వలేదన్నారు. మంచి ఉంటే మైక్ లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పుకుందామని అన్నాను. అది గౌరవం ఇవ్వలేని వారికి… నిజంగా ఇక్కడ ఎందుకు ఉండాలి? పెద్దలుగా మేమంతా ఎందుకు ఉండాలి?అని ప్రశ్నించారు.

ఎందుకు ఇలా రసాభాస చేయడం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనతను చెప్పుకోవడం ఎలా ఉంటుంది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే అని చిరంజీవి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.కృష్ణంరాజు సైతం రాజశేఖర్ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -