మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే ఈ మూవీ టీజర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు దర్శకుడు కొరటాల. ఆచార్య సినిమా టీజర్‌పై 27న ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి ఎంతో ఆసక్తికరమైన రీతిలో వెల్లడించారు. ఈ సాయంత్రం ఆయన ట్వీట్ చేస్తూ… దర్శకుడు కొరటాల శివతో తాను సీరియస్‌గా చర్చించానని, ఆ విషయం ఏంటన్నది సాయంత్రం 6.30 గంటలకు అప్ డేట్ ఇస్తానని ట్వీట్ చేశారు. చెప్పిన సమయానికే ఆయన కొరటాలతో తన చర్చల వివరాలను చిత్ర రూపంలో పంచుకున్నారు.
ఇద్దరి మధ్య సంభాషణ…
చిరు: ఏమయ్యా కొరటాలా… ఆచార్య టీజర్ న్యూ ఇయర్ కి లేదు, సంక్రాంతికి లేదు, ఇంకెప్పుడు..?
కొరటాల: సార్, అదే పనిలో ఉన్నా!
చిరు: ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా!
కొరటాల: రేపు ఉదయాన్నే అనౌన్స్ మెంట్ ఇచ్చేస్తాను సార్!
చిరు: ఇస్తావుగా..!
కొరటాల: అనౌన్స్ మెంట్ రేపు ఉదయం 10 గంటలకు ఫిక్స్ సార్!
ఈ సంభాషణను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో పంచుకున్నారు. కాగా, ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డితో కలిసి హీరో రామ్ చరణ్ కొణిదెల బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఇందులో మరోసారి చిరంజీవితో కాజల్ అగర్వాల్ జోడీ నటిస్తోంది. దేవాదాయ భూముల స్కామ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల.