భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని పొగుడుతూ.. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను కొందరు తిడుతున్నారు అంటూ హైపర్ ఆది కామెంట్స్ చేశాడు. పైగా వారిని తెలివైన శాడిస్టులు అంటూ ఓ పేరు కూడా పెట్టాడు. మొత్తానికి కమెడియన్ ఆది స్పీచ్ బాగా వైరల్ అయ్యింది. అయితే, ఈ స్పీచ్ వెనుక నాగబాబు ఉన్నాడని.. నాగబాబు రాసి ఇచ్చిన మాటలను ఆది తనదైన శైలిలో చెప్పాడని అంటున్నారు. ఇప్పుడు దీని పై మరో వార్త వినిపిస్తోంది. ఈ స్పీచ్ వెనుక చిరంజీవి కూడా ఉన్నాడట. పైగా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంలో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కి సపోర్ట్ గా ప్రచారం చేస్తాడట.
అందుకే, తాజాగా రాజకీయాలపై కూడా చిరు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందమంతా వేడుక చేసుకుంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి ? ‘ అంటూ చిరంజీవి చురకలంటించారు.
Also Read:కూరగాయలను పచ్చిగా తింటే ప్రమాదమా?
చిరంజీవి ఎవర్ని దృష్టిలో పెట్టుకొని ఈ కామెంట్స్ చేశాడో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక్క జగన్ మోహన్ రెడ్డి మాత్రమే.. సినిమా పరిశ్రమను టార్గెట్ చేశాడు. టికెట్ రేట్లు తగ్గించి.. హీరోలను తన ఇంటి చుట్టూ తిప్పించుకుని వారిని అవమానించడం.. మొత్తానికి జగన్ హీరోల పై ఇండస్ట్రీ పై తన అధికారం చూపించాడు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి కోసం సినిమా పరిశ్రమ కూడా పరోక్షంగా పని చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే చిరు ఈ కామెంట్స్ చేశాడు. పైగా పవన్ కి తన సహకారం ఈ సారి డైరెక్ట్ గా ఇవ్వాలని చిరంజీవి భావిస్తున్నారు.
Also Read:మోకాళ్ళ నొప్పులుంటే.. నడవకూడదా?