14న ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ..

361
chiru jagan

ఏపీ సీఎం జగన్‌ని కలవనున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ నెల 14న తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో రామ్‌ చరణ్‌తో కలిసి జగన్‌తో సమావేశం కానున్నారు. సైరా సినిమా చూడాలని జగన్‌ని కోరనున్నారు.

వాస్తవానికి ఇవాళే జగన్‌తో చిరంజీవి భేటీ కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఈ భేటీలో సైరా సినిమాకు సంబంధించిన విషయాల గురించి చర్చించబోతున్నట్టు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా టాలీవుడ్లో మంచి విజయం సాధించింది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు. మెగాస్టార్ నటనను ప్రతి ఒక్కరు మెచ్చుకున్తున్నారు. తెలంగాణ గవర్నర్ కూడా ఈ సినిమాను చూసి బాగుందని మెచ్చుకున్నారు.