అద్భుతమైన ప్రేమకావ్యం “ఉప్పెన” : చిరంజీవి

277
uppena
- Advertisement -

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం “ఉప్పెన”. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు ఆల్రెడీ సంగీత ప్రియులను అలరిస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. విలేజ్ బాక్డ్రాప్ లో ప్యూర్ లవ్ స్టొరీగా హై ఎమోషన్స్ తో రూపొందిన “ఉప్పెన” చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ లో వస్తోన్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక సినీ ప్రముఖులు, మెగా అభిమానుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని యాంకర్ సుమ రసవత్తరంగా నిర్వహించింది.. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఈ ఫంక్షన్ కి ప్రముఖ దర్శకులు కొరటాల శివ, హరీశ్ శంకర్, గోపిచంద్ మలినేని, బాబీ, సందీప్ వంగా, శివ నిర్వాణ, కిషోర్ తిరుమల, వెంకీ కుడుముల విశిష్ట అతిధులుగా హాజరయ్యారు.. సుకుమార్, హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, దేవిశ్రీప్రసాద్, కెమెరామెన్ శ్యామ్ దత్, కళా దర్శకులు రామకృష్ణ, మౌనిక, గేయ రచయిత చంద్రబోస్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సిఇఓ చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అశోక్, అనిల్, నటుడు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.. ఈ చిత్రంలోని ఒక్కోపాటను దర్శకులు ఆవిష్కరించారు.. “ఉప్పెన” న్యూ ట్రైలర్ ను హరీశ్ శంకర్ రీ లాంచ్ చేశారు. ఫిబ్రవరి 12న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లలో విడుదల కానున్న “ఉప్పెన” ఫస్ట్ టికెట్ ను మెగాస్టార్ చిరంజీవి కొనుగోలు చేశారు… అనంతరం ఈ కార్యక్రమంలో…

ఫైనేస్ట్ డైరెక్టర్ అవుతాడు!!
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. ” ఏ సినిమా అయినా రిలీజ్ అయిన రెండు, మూడు రోజులకు ఏ రేంజ్ హిట్ అనేది తెలుస్తుంది.. కానీ రిలీజ్ కి ముందే హిట్ అని కొన్ని సినిమాలు తెలుస్తాయి.. అందులో ఒకటి “ఉప్పెన”.ఇది ఈవెంట్ లా లేదు.. సక్సెస్ మీట్ లా ఉంది. యూనిట్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు. ఇంత బాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన బుచ్చిబాబు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్ అవుతాడు. సుకుమార్ నుంచి ఇంకా చాలా మంది డైరెక్టర్స్ వస్తారు. మైత్రీ మూవీస్ సంస్థ ఇండియాలో అన్నీ భాషల్లో సినిమాలు తీయబోతున్నారు. ఇండియాలో బిగ్గెస్ట్ బ్యానర్ గా ట్రావెల్ కానుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచేవిధంగా సినిమాలు చేస్తున్నారు. నవీన్, రవి వెరీ ఫ్యాషనెట్ ప్రొడ్యూసర్స్.. వారి జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటుంది. ఉప్పెన సినిమాని చాలా జాగ్రత్తలు తీసుకొని చేశారు. ఏ ప్రొడ్యూసర్ కూడా చేయలేంతగా అన్నీ ప్రొవైడ్ చేసి ఈ సినిమా నిర్మించారు.. ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టం. బుచ్చిబాబు కథ చెప్పినప్పుడే నాకు సినిమా చూపించాడు. అప్పుడు నాకు ఆనందం, ఈర్ష కలిగాయి.. అంత గొప్ప కథతో ఈ సినిమా తీశాడు. వైష్ణవ్ తేజ్, కృతి అన్బిలివబుల్ పెర్ఫార్మెన్స్ చేశారు. క్యారెక్టర్స్ లో ఇమిడిపోయి ఇద్దరూ పోటా పోటీగా నటించారు. అందరూ ప్రాణం పెట్టి ఈ సినిమాకి వర్క్ చేశారు. టీమ్ అందరికీ అభినందనలు.. అన్నారు.

పెద్ద స్టార్ అవుతాడు!!
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ” రాజ్ కపూర్ ఫ్యామిలీ తర్వాత మళ్ళీ అంత అదృష్టం చిరంజీవి గారికి దక్కింది. మెగా ఫ్యామిలీలో ఇంత మంది హీరోలు రావడం వారు స్టార్స్ గా ఎదగడం మాములు విషయం కాదు. ఇండస్ట్రీ అంటే మాది కాదు మనందరిదీ అని చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఫీలవుతారు.. చెప్తుంటారు. అందుకే వాళ్ళు గొప్ప స్థాయికి చేరుకున్నారు. అది వారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. పోలికలు భగవంతుడు ప్రసాధిస్తే గుణగణాలు మనమే సపాదించుకోవాలి.. అలా వైష్ణవ్ తేజ్ మంచి పేరు తెచ్చుకుంటాడు.. వైష్ణవ్ కళ్ళు అచ్చం వారి తాతగారు వెంకట్రావు గారి కళ్లలా ఉంటాయి. డెఫినెట్ గా పెద్ద స్టార్ అవుతాడు. బుచ్చిబాబు అబద్ధాని కూడా చాలా అందంగా చెపుతాడు. అలాంటి వాళ్ళు కచ్చితంగా పెద్ద డైరెక్టర్లు అవుతారు. ఉప్పెన చాలా బాగా వచ్చిందని విన్నాను. దేవిశ్రీప్రసాద్ చాలా ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చాడు. మైత్రీ వాళ్ళు చాలా అభిరుచి ఉన్న నిర్మాతలు.. తప్పకుండా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది.. అన్నారు.

ప్యూర్ లవ్ స్టోరీ ఇది!!
దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘ ఏ డైరెక్టర్ కైనా ఫస్ట్ సినిమా ఒక పెద్ద బ్యానర్లో చేయాలని ఉంటుంది. మైత్రీ, సుకుమార్ లాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం బుచ్చిబాబు అదృష్టం. సినిమా అంటే చాలా ఫ్యాషన్ బుచ్చికి. ప్యూర్ లవ్ స్టోరీతో ఈ సినిమా తీశాడు. మంచి లవ్ స్టొరీ చూసి చాలా రోజులైంది. సాంగ్స్, ట్రైలర్స్ సూపర్బ్ గా ఉన్నాయి. దేవి ఎక్స్ ట్రార్డినరి మ్యూజిక్ ఇచ్చాడు. విజువల్స్ అన్నీ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. డెఫినెట్ గా ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అవుతుంది.. అన్నారు.

తనకి విపరీతమైన నాలెడ్జ్!!
దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ‘ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నపుడే ఇది సక్సెస్ అని తెలుస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక ఎక్స్పెరిమెంట్ సినిమా తీశాడు. బుచ్చిబాబు విపరీతమైన నాలెడ్జ్ ఉన్న పర్సన్. మైత్రీ ప్రొడ్యూసర్స్ ఎంతో ఖర్చుపెట్టి ఈ సినిమా నిర్మించారు. విజువల్స్ అన్నీ పెంటాస్టిక్ గా ఉన్నాయి. పాటలన్ని మనసుకి హత్తుకునేలా ఉన్నాయి. టీమ్ అందరకీ ఆల్ ది బెస్ట్.. అన్నారు.

బిగ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్!!
దర్శకుడు సందీప్ వంగా మాట్లాడుతూ.. ‘ ఈ కథ విన్నప్పుడు ఇలాంటి ఐడియా నాకెందుకు రాలేదు అనిపించింది. సాంగ్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి. హీరో వైష్ణవ్ తేజ్, కృతి చాలా ఇన్నోసెంట్ గా వున్నారు. మైత్రీ నుండి ఈ సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది. బుచ్చిబాబు గ్రేట్ లవ్ స్టొరీ తీశాడు. కచ్చింతంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది.. అన్నారు.

గొప్ప విజయం సాదిస్తుంది!!
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘ ఉప్పెన కథ విని చాలా సప్రయిజ్ అయ్యాను. బుచ్చిబాబు చాలా డీసెంట్ గా ఉంటాడు. సుకుమార్ గారిలో ఉన్న ఫ్యూరిటీ పునికి పుచ్చుకున్నాడు. ఈ సినిమా చూశాక అందరికీ ప్రేమించాలి అనిపిస్తుంది. ప్రేమపై గౌరవం పెరుగుతుంది. దేవీ మ్యూజిక్, శ్యామ్ దత్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మైత్రీ నవీన్, రవి గారు చాలా కాన్ఫిడెంట్ గా సినిమా నిర్మించారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అని కోరుకుంటున్నా.. అన్నారు.

డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ‘ దేవీ మ్యూజిక్ ఓ రెంజ్ లో చేశాడు. టీజర్, ట్రైలర్ చూశాను. నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సినిమా సూపర్ హిట్ అవ్వాలి అన్నారు.

మరొక దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ.. ‘ ఉప్పెన టీజర్ ట్రైలర్ చాలా ఎక్స్ ట్రార్డినరీగా ఉన్నాయి. తేజ్ చాలా ప్రామిసింగ్ హ వున్నారు. దేవీ వల్ల సినిమాకి పెద్ద బజ్ వచ్చింది. సాంగ్స్ అంతలా బాగా రీచ్ అయ్యాయి. మైత్రీ మూవీస్ నవీన్, రవి గారు సింగిల్ థియేటర్స్ లా కాకుండా మల్టీప్లెక్స్ థియేటర్స్ లా చాలా సినిమాలు చేస్తున్నారు. నా లాంటి డైరెక్టర్స్ కి, హీరోలని ఎంకరేజ్ చేస్తున్నారు.. తప్పకుండా ఈ చిత్రం మంచి సక్సెస్ అవ్వాలి.. అన్నారు.

సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్!!
సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. ‘ లవ్ స్టోరీస్ కి మ్యూజిక్ చేస్తే ఆ కిక్కే వేరు. ప్యూర్ లవ్ స్టొరీ ఉప్పెన సినిమాకి వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. బుచ్చిబాబు డైరెక్షన్ అమేజింగ్ గా ఉంది. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలని కసితో చేశాం. అంత ఇంపాక్ట్ ఉన్న కథ ఇది. వైష్ణవ్ తేజ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ లెంట్ గా చేశాడు. బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. కృతి ఎక్స్ ట్రార్డినరిగా చేసింది. చంద్రబోస్, శ్రీమణి బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. గ్యారెంటీగా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నారు.

ఆ క్రెడిట్ అంత ఆయనకే!!
హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘ నా జీవితంలో ఒక స్పెషల్ డే. చిరంజీవి గారు మాకు ఇన్స్పిరేషన్. సుకుమార్ గారు చెప్పిన మాటలు ఇప్పటికీ నా మనసులో దాచుకున్నాను. ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇంత బాగా నటించానంటే ఆ క్రెడిట్ బుచ్చిబాబుకె దక్కుతుంది. డైలాగ్స్ వింటే బుజ్ బమ్స్ వస్తాయి. అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. విజయ్ సేతుపతి గారి కూతురిగా నటించడం గొప్పగా ఫీలవుతున్నాను. వైష్ణవ్ వెరీ నైస్ కో యాక్టర్. తనతో నా ఫస్ట్ ఫిల్మ్ చేయడం వెరీ హ్యాపీ. మా సినిమా ఇంత రీచ్ అయిందంటే దేవీ కారణం. రిలీజ్ కి ముందే మాకు పెద్ద హిట్ ఇచ్చారు. మైత్రీ బ్యానర్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.. అన్నారు.

ఆయనలా పెద్ద స్టార్ అవుతాడు!!
చిత్ర దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ‘ ఘరానా మొగుడు’ సినిమా చూడాలని ప్రతిరోజు నేను, మా అన్న థియేటర్ కి వెళ్ళేవాళ్ళం. టికెట్స్ దొరికేవి కావు. అలా 75రోజులు దాకా వెయిట్ చేశాం. అలాంటిది ఇప్పుడు చిరంజీవి గారిని కలిసి నాలుగు గంటలపాటు కథ చెప్పి నెరేషన్ ఇవ్వడం నా జీవితంలో మర్చిపోలేను. ఆయన చెప్పిన మాటలు, ఇన్పుట్స్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సుకుమార్ గారు నాకు లెక్కలు చెప్పకపోతే నేను ఇక్కడిదాకా వచ్చేవాడ్ని కాదు.. ఎక్కడో.. ఏదో ఓ పని చేసుకునేవాడ్ని. సుకుమార్ గారివల్లే నేను డైరెక్టర్ ని అయ్యాను. ఉప్పెన కథ ఎలా రాశానో అలాగే తీయడానికి మైత్రీ నవీన్, రవి గారు కారణం. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను సినిమాని బాగా తీయగలిగాను. వైష్ణవ్ తేజ్ కళ్ళకు లవ్ లో పడిపోయాను. పవన్ కళ్యాణ్ గారిలా పెద్ద స్టార్ అవుతాడు తేజ్. కృతి శెట్టి కూడా స్టార్ హీరోయిన్ అవుతుంది. చాలా ఎమోషన్స్ తో రాసిన స్క్రిప్ట్ ఇది. అందరికీ నచ్చేలా ఉంటుంది.. అన్నారు.

ఎమోషనల్ హార్ట్ టచ్చింగ్ సబ్జెక్ట్!!
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ‘ బుచ్చిబాబు డ్రీమ్ ని నెరవేర్చిన మైత్రీ నిర్మాతలు నవీన్, రవికి థాంక్స్. ఉప్పెన వెరీ ఎమోషనల్ హార్ట్ టచ్చింగ్ స్క్రిప్ట్. టోటల్ డైలాగ్స్ వెరీ హాసం. వైష్ణవ్ తేజ్ ఐస్ చాలా ఎక్స్ ప్రెసివ్ గా ఉంటాయి. దేవీ మ్యూజిక్ వెరీ నైస్. లిరిక్స్ పెంటాస్టిక్ గా ఉన్నాయి. ప్రేక్షకులందరికీ ఈ చిత్రం బాగా నచ్చుతుంది అన్నారు.

నా శిష్యుడు అయినందుకు గర్వపడుతున్నా!!
ప్రముఖ దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. నా దెగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన వారి దెగ్గర్నుండి నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటాను. ఎవరి టాలెంట్ వారిది. కానీ నేను ఎవర్ని నా శిష్యుడు అని చెప్పుకోలేదు.. ఆవిషయం అందరికీ తెలుసు. ఇప్పుడు బుచ్చిబాబు నా శిష్యుడు అని గర్వాంగా చెప్పుకుంటాను. ఉప్పెన కథ వినగానే ఇది 100 కోట్ల సినిమా అని నవీన్, రవి గారికి చెప్పాను. చాలా టాలెంట్ ఉన్న బుచ్చిబాబుకి మంచి భవిష్యత్ ఉంటుంది. అలాంటి వ్యక్తికి నేను లెక్కలు చెప్పినందుకు గర్వపడుతున్న. చాలా కష్టపడి ఈ సినిమా చేసి ఒక బజ్ క్రియేట్ చేశాడు. విజయ్ సేతుపతి గారు చాలా బిజీగా వున్నా కథ విని ఎంతో ఇంప్రెస్ అయి ఈ సినిమా చేశాడు. దేవిశ్రీప్రసాద్ ఆణిముత్యాల్లాంటి పాటలు ఇచ్చాడు. మెగా ఫ్యామిలీ హీరోలంతా స్టార్స్ అవడానికి చిరంజీవి గారి జడ్జిమెంట్ కారణం అని నేను బలంగా నమ్ముతాను.. ఉప్పెన కథ చెప్పినప్పుడు ఈ విషయం నాకు అర్థం అయింది. వైష్ణవ్ తేజ్ ఐస్ చాలా ఎక్స్ ప్రెసివ్ గా ఉంటాయి. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది తేజ్. నవీన్, రవి చాలా ప్యాషన్తో సినిమాలు చేస్తారు. అందుకే వారికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది.. అన్నారు.

వారికి ఎప్పటికీ ఋణపడి ఉంటాను!!
హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. ‘ ముందుగా మా అమ్మా, నాన్నలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మా కోసం ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా మా ముగ్గురు మావయ్యలు లేకపోతే మేము లేము. మాకు ఏది కావాలన్న అన్నీ ఇచ్చి సపోర్ట్ చేశారు.. అందరికీ నా కృతజ్ఞతలు. ఈ చిత్రంలో నేను హీరో కాదు. ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేసానంతే. కథే మెయిన్ హీరో. ఇలాంటి ఒక మంచి కథతో నాతో ఈ సినిమా చేసిన బుచ్చిబాబుకి, మైత్రీ మూవీస్ నవీన్, రవి గారికి నా థాంక్స్. ఉప్పాడలో ఈ సినిమా మేజర్ షూటింగ్ అంతా చేశాము. అది డైరెక్టర్ బుచ్చిబాబు గారి ఊరు. అక్కడి ప్రజలంతా మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మా ప్రొడ్యూసర్స్ అందరూ ఖర్చుకు వెనకాడకుండా అన్నీ ప్రొవైడ్ చేసి నన్ను చాలా గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. సుకుమార్ గారు నాకు అన్నీ నేర్పించడమే కాకుండా బాగా ఎంకరేజ్ చేసి.. నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచారు. శ్యామ్ దత్ ఔట్ స్టాండింగ్ విజువల్స్ ఇచ్చారు. ఒక ఫ్రెండ్ లా నన్ను ట్రీట్ చేసి నాకు చాలా హెల్ప్ చేశారు ఆయన. సీనియర్ యాక్టర్ సాయి చంద్ గారు నాకు ఫాదర్ గా సూపర్బ్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం లక్కీగా భావిస్తున్నాను.హీరోయిన్ కృతి తెలుగు నేర్చుకొని చాలా డెడికేటెడ్ ప్రతి డైలాగ్ చెప్పింది. ఎక్స్ ప్రెషన్స్ వైజ్ నాకు చాలా టిప్స్ చెప్పి సపోర్ట్ చేసింది. ఈ సినిమా నాకు చాలా విషయాలు నేర్పించింది. ఈ సినిమాకి సోలో దేవిశ్రీప్రసాద్. ఆయన మ్యూజిక్ తోనే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. విజయ్ సేతుపతి గారితో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ర, రస్టిక్ ఫైట్స్ తో రియాలిటీకి దెగ్గరగా ఉండేలా నందు ఫైట్స్ కంపోజ్ చేశాడు. సెంటిమెంట్, ప్రేమ, ఏమోషన్స్ అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ సినిమాకి డే అండ్ నైట్ కష్టపడి పనిచేసిన ప్రతీ ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు. ప్రేక్షకులు, అభిమానులు “ఉప్పెన” చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘ ఉప్పెన సినిమా చూశాక అర్జెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి నా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకుందాం అనుకున్నాను. అంత గొప్పగా సినిమా ఉంది. అద్భుతమైన దృశ్యకావ్యంలా ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. బుచ్చిబాబు కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా రాసుకున్నాడు. నేను కరేప్షన్ చెప్పడానికి అందులో ఏమీలేదు. కథ చెప్పినదానికంటే గొప్పగా ఎమోషన్స్ సీన్స్ అన్నీ కట్టిపడేసేలా ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా చిత్రీకరించారు. స్క్రీన్ ప్లే చాలా గొప్పగా ఉంటుంది. ఈ సినిమా చూశాక స్క్రీన్ ప్లే అంటే ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. అంతలా కొత్తగా వచ్చే డైరెక్టర్స్ అందరికీ ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది. స్క్రీన్ ప్లే కి పర్ఫెక్ట్ ఎగ్జామ్ ఫుల్ గా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూశాక నాకు 80, 90 దశకంలో భారతీ రాజా గారు తీసిన సినిమాలు గుర్తుకువచ్చాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్స్ లో మట్టికథలతో ఆయన గొప్ప చిత్రాలు చేశారు. అలాంటి మన మట్టి కథలు రావాలి. ఇది మన కథ.. మన నేటివిటీ ఉన్న ప్రేమకథ అని ఉప్పెన రుజువు చేస్తుంది. అంత గొప్ప సినిమా చేసిన బుచ్చిబాబు ని అభినందిస్తున్నాను. ఇండియా మొత్తం అభిమానులను సంపాదించుకున్న విజయ్ సేతుపతి వెర్సటైల్ యాక్టర్. కొత్త వారిని సపోర్ట్ చేసి ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ లో నటించాడు. ఆయన నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఒక పక్క హీరోగా చేస్తూ.. మరో పక్క ఇంపార్టెన్స్ క్యారెక్టర్స్ చేస్తున్న విజయ్ కి హ్యాట్సాప్. కృతి శెట్టి బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చేసింది.. బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఇక ఈ చిత్రంలో అత్యద్భుతంగా నటించిన వైష్ణవ్ తేజ్ మా మెగా ఫ్యామిలీకి నాకు గర్వకారణం. అంత బాగా పెర్ఫార్మెన్స్ చేయించిన బుచ్చిబాబు ప్రధాన కారణం. ఒక మంచి నటుడ్ని ఉప్పెన ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసిన బుచ్చికి, మైత్రీ మూవీస్ కి నా థాంక్స్. శంకర్ దాదా మూవీలో వీల్ చైర్ లో కూర్చుని నటించిన బాబే వైష్ణవ్ తేజ్. తన కళ్ళతో ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా పలికించాడు. అప్పుడే నాకు వాడు పెద్ద స్టార్ అవుతాడని తెలిసింది. అలాంటి వాడికి ఉప్పెనలో ఛాన్స్ రావడం ఎంతో అదృష్టం. మా తేజ్ కి మంచి భవిష్యత్ ప్రసాదించాలని భగవంతుడుని కోరుకుంటున్నాను. దేవిశ్రీప్రసాద్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చే సాంగ్స్ కంపోజ్ చేసాడు. పాటలతోనే సినిమాపై క్యూరియసిటీని పెంచాడు. ‘నీ కన్ను నీలి సముద్రం’ పాటతో వండర్స్ క్రియేట్ చేసాడు. అలాంటి సినిమా పెద్డ హిట్ కాబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్యామ్ దత్ విజువల్స్ ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతాయి. ఈ సినిమాకి పనిచేసిన టీమ్ అందరికీ అభినందనలు. చెర్రీ ఈ సినిమాని సకాలంలో పూర్తిచేశారు. అనతి కాలంలోనే మైత్రీ మూవీస్ నంబర్ వన్ సంస్థగా ఎదిగింది. నవీన్, రవి సినిమా మీద ఫ్యాషన్ తో ఇష్టంతో చేస్తున్నారు. ప్రతీ హీరో వారిని లైక్ చేస్తారు.. అది వారి స్పెషాలిటీ. మైత్రీ బ్యానర్ లో సినిమా చేయాలని ప్రతిఒక్క హీరో కోరుకుంటారు. నాతో కూడా బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. అందరి సమిష్టికృషితో తెరకెక్కిన ఉప్పెన చిత్రం ప్రతీ ఒక్కరిని అలరించి వారి మన్నలను పొందుతుంది. చాలా సంతృప్తిని కలిగిస్తుంది. ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించి.. ఇండస్ట్రీలో కలకాలం నిలిచిపోతుంది. అద్భుతమైన ప్రేమకావ్యంగా రూపొందిన “ఉప్పెన” ఒక ఎపిక్ అవుతుంది.. మైత్రీ మూవీస్ బ్యానర్లో ఈ చిత్రం ఒక ‘రంగస్థలం’ అవుతుంది.. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఇంటికే పరిమితమై దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం.. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా.. మళ్ళీ పరిశ్రమ ఎప్పుడు కళ కళలాడుతుంది. అసలు షూటింగ్స్ జరుగుతాయా! జరగవా.. అనే సందిగ్ధంలో అందరూ ఉండిపోయారు. అదృష్టం కొద్దీ మళ్ళీ సినిమాల షూటింగ్స్ స్టార్ట్ కావడం, థియేటర్స్ ఓపెన్ కావడం చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతి వచ్చిన సినిమాలను ఆదరించారు. మాకు ఎంటర్టైన్మెంట్స్ కావాలి.. మేము థియేటర్ లొనే సినిమాలు చూస్తాం అని..అందరూ వచ్చి సినిమాలు చూస్తునందుకు వారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తూన్నాను. ప్రేక్షకులు, అభిమానుల వల్లే మేమంతా బతుకుతున్నాం. వారిచ్చిన ప్రేమ, భరోసా మాకు నూతనోత్సహాన్ని ఇచ్చింది. ప్రతీ ఒక్కరినీ అభినందిస్తున్నాను.. అన్నారు.

ఫిబ్రవరి 12న గ్రాండ్ రిలీజ్!!
నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మాట్లాడుతూ… ముందుగా పిలవగానే మా ఈవెంట్ కి వచ్చిన చిరంజీవి గారికి, దర్శకులకు, అభిమానులకు చాలా చాలా థాంక్స్. బుచ్చిబాబు కథ చెప్పినదానికంటే టు హండ్రెడ్ పర్సెంట్ బాగా తీశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. మా సంస్థలో పనిచేస్తున్న డైరెక్టర్స్, వెల్ విషర్స్ అందరూ సినిమా చూసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు అని అప్రిషియేట్ చేస్తున్నారు. చిరంజీవి గారు కూడా సినిమా చూసి చాలా గొప్ప సినిమా తీశారు అని ఆయన సంతోషాన్ని అంతా మాతో షేర్ చేసుకున్నారు. వైష్ణవ్ తేజ్ కి ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు. వారందరికీ మా మైత్రీ టీం అందరికీ చాలా థాంక్స్. ఇంత మంచి అద్భుతమైన సినిమాని మా బ్యానర్ లో చేసిన సుకుమార్ గారికి, బుచ్చిబాబు లకు మా ధన్యవాదాలు. ఫిబ్రవరి 12న వరల్డ్ వైడ్ గా ఉప్పెన రిలీజ్ అవుతుంది. ప్రతీ ఒక్కరూ మా సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాము.. అన్నారు.

- Advertisement -