Janasena:పవన్ కోసం కదిలిన చిరు

26
- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఆయన కుటుంబ సభ్యులు తరలివస్తున్న సంగతి తెలిసిందే. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నుండి ఇప్పటికే నాగబాబు, ఆయన భార్య, వరుణ్ తేజ్, సాయి ధర్మతేజ్ రోడ్ షోలు నిర్వహించారు. అలాగే జబర్దస్త్ టీం విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

ఇక ప్రచారం మరో ఆరు రోజుల్లో ముగియనుండగా తమ్ముడి కోసం కదిలారు చిరు. పవన్ గెలుపు కోసం స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. తమ ఇంట్లో ఆఖరివాడైనా ప్రజలకు మంచి చేయడంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ముందు ఉంటారన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటాడని..బలవంతంగా సినిమాల్లోకి వచ్చినా ఇష్టంతోనే రాజకీయాల్లోకి వచ్చారని కొనియాడారు.

తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి పవన్ అన్నారు. చట్టసభల్లో పవన్ గొంతు మనం వినాలని, పిఠాపురం ప్రజలకు సేవకుడిగా, సైనికుడిగా, అన్నయ్యగా నిలబడతాడని తెలిపారు.

Also Read:సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేయండి..ఈసీ ఆదేశం

- Advertisement -