మెగాస్టార్ చిరంజీవి 157 వ సినిమాని ‘బింబిసార’ దర్శకుడు వశిష్టతో చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. అయితే, అడ్వెంచరస్ సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార, అనుష్క, మృణాళ్ ఠాకూర్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఫైనల్‌గా ఎవరు ఫిక్స్ అవుతారో వేచి చూడాలి. కాకపోతే, జవాన్ సూపర్ హిట్ సందర్భంగా ఈ సినిమాలో ‘నయనతార’ను తీసుకోవాలని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. ఐతే, నయనతార జవాన్ సినిమాకే 8 కోట్లు తీసుకుంది అంటున్నారు.
మరి మెగాస్టార్ సినిమాకి కూడా నయనతార ఆ స్థాయి రెమ్యునరేషనే అడగొచ్చు. మరి వశిష్ట టీమ్ 8 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉందా ?. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా నయనతారకు ఫోన్ చేసి.. తన 157 వ సినిమాని చేయాల్సిందిగా కోరాడు. గతంలో మెగాస్టార్ చిరంజీవి- నయనతార సైరా నరసింహ రెడ్డి సినిమాలో కలిసి పని చేశారు. కానీ, నయనతార రేంజ్ ఇప్పుడు మారిపోయింది. ఆమె సినిమాకి 8 కోట్లు డిమాండ్ చేస్తోంది కాబట్టి.. మేకర్స్ కచ్చితంగా అంత భారీ మొత్తాన్ని ఇచ్చుకోవాల్సిందే.
ఇటు చూస్తే.. ఈసారి నయనతారతో కచ్చితంగా సినిమా చేయాలని మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించుకున్నాడు. మరి దర్శకుడు వశిష్ట బడ్జెట్ ను ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి. అన్నట్టు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని 100 రోజుల్లోనే పూర్తి చేయాలని కోరారట. అనంతరం వినాయక్ తోనూ మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా ఒప్పుకుంటున్నారని టాక్.
Also Read:CM KCR:పచ్చదనం లేని సమాజాన్ని ఊహించలేం