హీరోలకు గురువైన వైజాగ్ సత్యానంద్

44
- Advertisement -

ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్ గా వుంటూ , ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటోర్ గా,ఒక గైడింగ్ ఫోర్స్ గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్ గా వుంటూ , సినిమాని ప్రేమిస్తూ , సినిమానే ఆస్వాదిస్తూ , సినిమాని తన జీవన విధానం గా మలచుకున్న నిత్య సినీవిద్యార్ధి , తరతరాల సినీ ప్రముఖులoదరికీ ప్రియ మిత్రులు, నాకు అత్యంత ఆప్తులు, మృదు భాషి , సౌమ్యులు, సత్యానంద్ తన సినీ ప్రస్థానం లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు నా హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు. ఆయనతో నా వ్యక్తిగత అనుబంధం , నా అనేక చిత్రాలలో ఆయన వహించిన పాత్ర ఎంతో ప్రగాఢమైనది.

Dearest Satyanand Garu , మీరిలాగే మీ సినీ పరిజ్ఞానాన్ని , సినీ ప్రేమని, అందరికీ పంచుతూ, మరెన్నో చిత్రాల విజయాలకు సంధాన కర్త గా, మరో అర్ధ శతాబ్దం పాటు ఇంతే ఎనర్జీ తో ఉండాలని ఆశిస్తున్నాను అని తెలిపారు చిరు.

- Advertisement -